Price Hike : యాంటీ బయాటిక్స్, పెయిన్కిల్లర్లు ఇక మరింత ప్రియం
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని అత్యవసర మందుల జాబితాలో ఉన్న ఔషధాలు మరింత ప్రియం కానున్నాయి. వీటి ధరలను పెంచుతున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ వెల్లడించింది.
Essential Medicines Price Hike : ఇప్పటికే నిత్యవసరాల ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఎక్కువ భారం మోస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఎక్కువగా వాడే కొన్ని ఔషధాల ధరలు సైతం పెరుగుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొత్తం 923 రకాల మందులపై 0.0055శాతం పెంపు విధించారు. ఈ విషయాన్ని జాతీయ ఔషధాల ధరల సంస్థ
(National Pharmaceutical Pricing Authority- NPPA) వెల్లడించింది.
ఎన్పీపీఏ వార్షికంగా విడుదల చేసే ‘టోకు ధరల సూచీ’లో ఈ మేరకు ధరల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం అత్యవసర జాబితాలో ఉండే ఔషధాల ధరలు 0.0055 శాతం పెరగనున్నాయి(MEDICINES COST HIKE). ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మందుల్లో పెయిన్ కిల్లర్లు, యాంటీ బయాటిక్స్, టైప్ 2 డయాబెటీస్ మందులు, యాంటీ మలేరియా లాంటి ఔషధాలు ఉన్నాయి
ఈ ధరల పెరుగుదలలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఉదాహరణకు కొన్ని మందుల ధరలు ఎంత పెరగనున్నాయో తెలుసుకుందాం. డైక్లోఫెనాక్ బిళ్ల ధర ఒక్కొక్కటి ఇప్పుడు రూ. 2.05గా ఉంటుంది. ఇబుప్రోఫెన్ ట్యాబ్లెట్ 200ఎంజీది ఇప్పుడు రూ. 0.71గా మారనుంది. అది 400 ఎంజీది అయితే 1.20గా ఉంటుంది.