TG: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించినవారికి రూ.కోటీ 25 లక్షలు ఇవ్వాలని, అలాగే 65 ఏళ్లలోపు ఏ ఉద్యోగైనా సహజ మరణంతో చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్స్‌తో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చే స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు.