అత్యంత సంపన్నులు మాత్రమే కొనుక్కునే లాంబొర్గిని కార్ల సేల్స్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. ఎప్పుడూ లేనంతగా ఈ కార్లు అమ్ముడుపోయాయి. ఇంతకీ ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే..
Lamborghini: మనం రోడ్లపై సాధారణంగా ఎక్కువగా చూసే కార్లన్నీ దాదాపు ఐదు లక్షల నుంచి 20 లక్షల లోపు రేటు ఉంటాయి. నలభై లక్షలు, యాభై లక్షల రేట్లున్న కార్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇక కోటి రూపాయల పైన ఉండే రేంజ్ రోవర్లు, బెంజ్ కార్లు అత్యంత అరుదుగా మాత్రం చూస్తుంటాం. అయితే వీటన్నింటినీ మించి లాంబొర్గిని9Lamborghini) కార్ల రేట్లు ఉంటాయి. వీటి ధరలు మూడు కోట్లు మొదలుగుని తొమ్మది, పది కోట్ల వరకు ఉంటుంది. అలాంటి కారు ఒక్కటి అమ్ముడైనా అది లెక్క విలువ వేరుగా ఉంటుంది. అత్యంత సంపన్నులు మాత్రమే ఈ కార్లను కొంటారు. అందుకనే ఇది ప్రపంచ ఆటోమెమైల్ రంగంలో టాప్లో ఉంది. అయితే ఏ ఆర్థిక సంవత్సరంలోనూ సాధించని అమ్మకాల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించి రికార్డు సృష్టించింది.
గత 12 నెలల కాలంలో ఎప్పుడూ లేనంతగా లాంబొర్గిని(Lamborghini) కార్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10 వేల యూనిట్ల కార్లు సేల్ అయ్యాయి. అంటే ఎన్ని కోట్ల మార్కెట్ జరిగిందో మీరే ఊహించుకోండి. ఇలాంటి కార్ల సేల్స్ పెరగడం అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఊపిరి పోసినట్లే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో కంపెనీలు వార్షిక సేల్స్ లెక్కలు తీస్తున్నాయి. ఈ క్రమంలో లాంబొర్గినీ సేల్స్ పెరిగిన విషయం బయటపడింది.
ఇటీవల కాలంలో భారత్లో విలాసవంతమైన కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు బడ్జెట్ కార్ల కంటే ఎక్కువగా ఎస్యూవీల్లాంటివి కొనుక్కోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండటం వల్లనే ఇలా అత్యంత విలువైన కార్లు కూడా ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.