»Tillu Square Movie Review Did Dj Tillus Magic Work Out
Tillu Square Movie Review: డిజే టిల్లు మ్యాజిక్ వర్క్‌వుట్ అయ్యిందా?
సిద్ధూ జొన్నలగడ్డ డిజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
రాధిక దెబ్బ తర్వాత టిల్లు(సిద్ధూ జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్‌లు, డిజే ఈవెంట్లు చేస్తుంటారు. ఈక్రమంలో టిల్లు లైఫ్‌లోకి ఓ రోజు లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. అలా ఇద్దరు దగ్గరవుతారు. ఓ రోజు తన గదిలో ఒక లెటర్ పెట్టి లిల్లీ మాయమవుతుంది. లిల్లీ ఎక్కడ ఉందని టిల్లు ఆమెను వెతకడం మొదలుపెడతాడు. ఇంతలో ఓ రోజు ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని లిల్లీ చెబుతుంది. దీంతో టిల్లు తనని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకువస్తాడు. సరిగ్గా టిల్లు బర్త్‌డే రోజు తనని ఇంటికి పిలుస్తుంది. అది రాధిక(నేహా శెట్టి) ఉండే ఫ్లాట్. రోహిత్(కిరీటి దామరాజు) ఎక్కడ చనిపోయాడే అదే ఫ్లాట్. సంవత్సరం నుంచి అన్నయ్య రోహిత్ కనిపించడం లేదని సాయం చేయమని టిల్లును కోరుతుంది. దాని తర్వాత ఏం జరిగింది? అసలు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్(మురళీ శర్మ)కు, టిల్లు లైఫ్‌కి లింక్ ఏంటి? అసలు చివరకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
డిజే టిల్లు హిట్ కావడానికి మొదటి కారణం టిల్లు క్యారెక్టరైజేషన్. హైదరాబాద్ భాషలో మాట్లాడటం వల్ల ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు. దీనికి సీక్వెల్‌గా వచ్చిందే టిల్లు స్క్వేర్. సిద్ధూ మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేశాడనే చెప్పవచ్చు. టిల్లు క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. సినిమా మొదలైనప్పటి నుంచి టిల్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా సినిమాను సెటప్ చేసుకున్నారు. టిల్లు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చెప్పక్కర్లేదు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ట్విస్టుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోలే అనిపిస్తుంది. ఒకసారి ప్రేమలో మోసపోయిన సరే.. మరోసారి ప్రేమలోకి వెళ్లాలనుకుని ప్రయత్నించి టిల్లు ఎలాంటి తిప్పలు పడ్డాడనేది సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అప్పటివరకు కామెడీగా ఉన్న సినిమా ఇంటర్వెల్ సీన్‌తో సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. అనుపమ గ్లామర్ డోస్, రొమాన్స్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే టిల్లు స్క్వేర్తో సిద్ధూ అదరగొట్టాడనే చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే?
సిద్ధూ జొన్నలగడ్డ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్… ప్రతిదీ పర్ఫెక్ట్ నోట్లో ఉంది. టిల్లు క్యారెక్టర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అనుపమ పరమేశ్వరన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. క్యారెక్టర్ బట్టి ఆమె గ్లామరస్‌గా కనిపించారు. మిగతా వాళ్లు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు.
సాంకేతిక అంశాలు
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. రామ్ మిర్యాల, అచ్చు పాటలు బాగున్నాయి. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుందనే చెప్పవచ్చు. దర్శకుడు మల్లిక్ రామ్ తనదైన దర్శకత్వంతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పవచ్చు. ఫైనల్‌గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ ఇచ్చారనే చెప్పవచ్చు.