Hyderabad: కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని కన్న కూతుర్నే ఓ తల్లి చంపేసింది. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల తల్లిదండ్రులు తన మేనబావను వివాహం చేసుకోమని ఒత్తిడి చేశారు. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. తననే వివాహం చేసుకుంటానని చెప్పింది.
ఈక్రమంలో తల్లిదండ్రులు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. ఇంతలో ఆ యువకుడు భార్గవి ఇంటికి వచ్చిన ఆమెతో మాట్లాడుతున్నాడు. తల్లి ఇంతలో ఇంటికి వచ్చిన అది చూసి కుమార్తెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసి, చీరతో ఉరి వేసి చంపేసింది. ఈ విషయాన్ని స్వయంగా భార్గవి సోదరుడు చెప్పడంతో తల్లిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.