NGKL: పదర మండల కేంద్రంలో అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని కోరుతూ పదర గ్రామస్తులు వైద్య అధికారి పావనికి వినతిపత్రం అందజేశారు. అత్యవసర సమయాల్లో వాహనం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.