Plants in Summer : దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. వేసవి కాలంలో వాటి పెంపకంపై కాస్త జాగ్రత్తలు అవసరం. ఎండలు మండిపోతున్న వేళ వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆ చిట్కాలేంటో(Tips) తెలుసుకుందాం రండి.
* ఎండాకాలంలో మొక్కలకు(Plants ) సరిపడనంత నీటిని అందివ్వడం అనేది అత్యవసరం. కుండీలో మొక్కలైనా, నేలమీద మొక్కలైనా సరే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నేలలో అయినా, కుండీలో ఉన్న మట్టిలో అయినా నీరు త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాటరింగ్ చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు నీరు పోసినా ఫర్వాలేదు.
* అలాగే పోసిన నీరు తొందరగా ఆవిరి అయిపోకూడదంటే మల్చింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. చెక్కపొట్టు, ఎండు ఆకుల్లాంటి వాటిని మొక్క మొదట్లో ఉన్న మట్టిపై కప్పి ఉంచితే మంచిది. అందువల్ల తొందరగా మొక్క మొదలు ఎండిపోకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
* కొన్ని మొక్కలు సెమీ షేడ్‌లో పెరిగేవి ఉంటాయి. వాటికి ఎక్కువ సేపు ఎండ తగలకుండా చోటును మార్చివేయాలి. వేసవిలో(Summer) ఎక్కువ ఎండలో ఉండగలిగిన వాటిని మాత్రమే బయట ఉంచాలి.
* అలాగే ఈ సమయంలో ఎన్పీకే లాంటి ఎరువుల్ని అప్పుడప్పుడూ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే కూరగాయల తుక్కులు, గుడ్లు పెంకుల్లాంటి వాటిని మొక్క మొదలుకు కాస్త దూరంలో పాతి పెట్టేస్తూ ఉండాలి. అందువల్ల వాటికి కావాల్సిన పోషకాలు ఎంచక్కా అందుతాయి.
* అలాగే వేసవి వస్తుందనుకున్నప్పుడు మొక్కల్ని ఒక సారి ప్రూనింగ్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు అవి వేసవి కాలం అంతా ఆరోగ్యంగా ఉంటాయి.