»Vladimir Putin Russian President Vladimir Putin Is A New Record
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరికొత్త రికార్డు
రష్యా అధ్యక్ష పీఠం మళ్లీ పుతిన్‌కే దక్కింది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘనవిజయం సాధించారు. వరుసగా అయిదోసారి అధ్యక్షునిగా రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో గెలిచారు.
Vladimir Putin: రష్యా అధ్యక్ష పీఠం మళ్లీ పుతిన్‌కే దక్కింది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘనవిజయం సాధించారు. వరుసగా అయిదోసారి అధ్యక్షునిగా రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో గెలిచారు. ఆయనకు 7.6 కోట్లమంది ఓట్లు వేశారని, ఇంత ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇతర దేశాల నుంచి పుతిన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా నేత కిమ్‌జోంగ్ ఉన్ తదితరులు ఉన్నారు. భారత్-రష్యా బంధం మరింత బలపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
గతనెల జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై మొదటిసారిగా పుతిన్ స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నామని.. కానీ ఇంతలోనే చనిపోయారని పుతిన్ తెలిపారు. చాలాఏళ్ల తర్వాత నావల్నీ పేరు నేరుగా ప్రస్తావించారు. నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో లేదోగానీ వారు తమ మాటల్ని ముగించకముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. నావల్నీ తిరిగి రష్యాకు రావొద్దనే షరతు విధించాను.