»Horoscope Today Todays Horoscope 2024 March 16th Will Participate In Dinner And Entertainment Activities
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 March 16th).. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు
ఈ రోజు(2024 March 16th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువు ఆరాధన మేలు చేస్తుంది. వృషభం
గ్రహబలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీమీ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానుకోవద్దు. మిథునం
ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూల వాతావరణం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సాయం చేసేవారున్నారు. కీలకమైన వ్యవహారాల్లో మేలైన ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సింహం
మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ బుద్ధిబలంతో వ్యవహరించడం ద్వారా కొన్ని కీలకమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం. కన్య
ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించడం మంచిది. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనవ్యయం ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు అందుకుంటారు.
తుల
చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ అభివృద్ధికి దోహదపడే విధంగా అధికారులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. వృశ్చికం
మనోబలంతో చేసే పనుల ద్వారా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. తోటివారితో కలిసిపోయి ముందుకు వెళ్లాలి. చంద్ర ధ్యానం శుభప్రదం. ధనుస్సు
మొదలుపెట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైనవారితో సమయాన్ని గడుపుతారు. దైవబలంతో కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి. చంచల బుద్ధి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు ఆరాధన మంచి చేస్తుంది.
మకరం
అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబసభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది. కుంభం
మధ్యమ ఫలితాలున్నాయి. ధన వ్యయం సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.