మాస్ క దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం డైరక్టర్ అయిదేళ్ల పాటు కష్టపడ్డాడు. సినిమా టీజర్, ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం: గామి నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు నిర్మాతలు:కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని రచన-దర్శకత్వం:విద్యాధర్ కగిత సంగీతం:నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం విడుదల తేదీ:2024 మార్చి 8
కథ
శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. ఇతను హరిద్వార్‌లో అఘోరాలతో కలిసి ఆశ్రమంలో ఉంటాడు. శంకర్‌కి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఈక్రమంలో శంకర్‌కి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. అలాగే శంకర్ ఆలోచనల్లో ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) వస్తుంటారు. వీళ్లు శంకర్ ఆలోచనల్లోకి ఎందుకు వస్తారు? అసలు వీళ్లు ఎవరు? శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపిస్తూ కథను మొదలుపెడతారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ తొందరగా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్‌కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటని ప్రేక్షకులో ఆలోచన రేకిత్తిస్తుంది. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఇంకో వైపు ఉంటుంది. ఇదే సమయంలో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్‌తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్‌లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్ కాస్త నెమ్మదిస్తుంది. ఇక సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటి ఉంటుంది. అది చూస్తే మనకి టెన్షన్ వస్తుంది. అయితే శంకర్‌కి అతని ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. కథలో కొత్తదనం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే?
అఘోర పాత్రలో విశ్వక్సేన్ అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తం ఒకే దుస్తుల్లో కనిపించే విశ్వక్సేన్ అఘోరగా కొత్తగా కనిపిస్తాడు. చాందిని చౌదరి తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్‌కి అతను ఫెర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని చెప్పవచ్చు. మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక వాళ్లు తమ పాత్రలకు తగ్గట్లుగా చేశారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్‌గా చూస్తే ఈ చిత్రం చాలా బాగుంది. ఓ కొత్త టీం, తక్కువ బడ్జెట్లో గొప్పగా తీశారని చెప్పవచ్చు. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది. పాటలు, ఆకట్టుకుంటాయి. బీజీఎం అయితే చాలా బాగుంది. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మ్ంట్ అద్భుతంగా వర్క్ చేశాయని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
+విశ్వక్సేన్ యాక్టింగ్
+విజువల్స్
+సినిమాటోగ్రఫీ
+బీజీఎం
+మొదటి భాగం