NZB: నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మాను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.