Katrina Kaif: 40 ఏళ్లకు స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్?
స్టార్ హీరోయిన్లు కాస్త లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే.. అమ్మతనాన్ని కూడా లేట్ వయసులోనే ఆస్వాదిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె పాటు మరో బ్యూటీ కూడా రీసెంట్‌గానే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.
Katrina Kaif: ఇటీవల హీరో, హీరోయిన్లు వరుసగా పెళ్లి పీఠలెక్కుతున్నారు. అలాగే.. పెళ్లైన రెండు మూడేళ్లకు తల్లి దండ్రులుగా మారుతున్నారు. రీసెంట్‌గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే సోషల్ మీడియాలో తల్లి కాబోతున్నానని ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా, రణ్‌వీర్‌ది స్పెషల్ ప్లేస్ ఉంటుందనే చెప్పాలి. వీరిద్దరి ప్రేమకథ రామ్‌లీలా సినిమా సెట్స్‌లో మొదలైంది. 2012లో డేటింగ్ ప్రారంభించి.. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరు తమ మొదటి బిడ్డను సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. దీంతో దీపిక, రణ్వీర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే.. ప్రస్తుతం దీపిక వయసు 40 కి చేరువలో ఉంది. దీంతో లేటు వయసులో తల్లి కాబోతోంది దీపిక. ఇక దీపిక లాగే 40 ఏళ్ల వయసులో మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె మరెవ్వరో కాదు.. కత్రినా కైఫ్. కెరీర్ స్టార్టింగ్‌లో తెలుగులో రెండు సినిమాలు చేసింది కత్రినా కైఫ్. ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది. 2021 డిసెంబర్ నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి జరిగి సుమారు రెండున్నరేళ్లు అవుతోంది. ఇక ఇప్పుడు తల్లి దండ్రులు కాబోతున్నారని బాలీవుడ్ మీడియా చెబుతోంది.
లేటెస్ట్గ్ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ స్టార్స్ అంతా అటెండ్ అయ్యారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు. అయితే.. ఈ వేడుకల్లో కత్రినా ఎక్కువగా దుపట్టాతో కనిపించింది. ముంబైకి తిరిగి వెళ్లే క్రమంలో కూడా దుపట్టా కప్పుకుని ఫొటోలకు ఫోజులిచింది. దాంతో కత్రినా ప్రెగ్నెంట్ అని, అందుకే బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి కత్రినా ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి.