VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.