KDP: దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడపలో భవన నిర్మాణ కార్మిక నాయకులు MRO నారాయణరెడ్డి, తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించి సొమ్ము విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ సెస్సును కార్మికుల సంక్షేమానికే వినియోగించి, వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలని నాయకులు కోరారు.