సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ సోమవారం మీడియా ముఖంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఫిలిప్స్ తయారు చేసిన స్లీప్ రెస్పిరేటర్లపై ఫిర్యాదులు రావడం వల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయన్నారు.
ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు. 3 నెలల కిందటే 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫిలిప్స్ సంస్థ ప్రకటించింది. గత ఏడాది త్రైమాసికంలో సుమారు 105 మిలియన్ యూరోల నష్టం వచ్చినట్లు ఫిలిప్స్ కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ గత ఏడాది మొత్తంగా 1.605 బిలియన్ యూరోలు నష్టపోయినట్లు తెలిపింది. ఈ తరుణంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫిలిప్స్ సంస్థ తెలిపింది.