ATP: సింగనమల మండలం పెరవల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి పూజలు నిర్వహించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కోలాట భజనలో పాల్గొన్నారు. వాల్మీకి సమాజం విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.