»Senior Actor And Politician Murali Mohan Looted Daliths Lands
Muralimohan : టీడీపీ మాజీ మంత్రి మురళీమోహన్ పై భూకబ్జా ఆరోపణలు!
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని లెజెండ్ గా నిలిచిన మురళీమోహన్ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
Muralimohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని లెజెండ్ గా నిలిచిన మురళీమోహన్ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మురళీమోహన్.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఊహించనంత స్థాయిలో తన వ్యాపారాలను విస్తరించుకున్నాడు. ఆ సమయంలోనే మునుపెన్నడూ లేని రేంజ్ లో ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడన్న టాక్ కూడా వచ్చింది.
అంతే కాకుండా హైదరాబాద్‌లో పలు భూములను కూడా కబ్జా చేశాడనే టాక్ కూడా ఉంది. అందుకు నిదర్శనమే ఈరోజు కోకాపేట్ గ్రామ ప్రజలు చేస్తున్న నిరసన. పూర్తి వివరాల్లోకి వెళితే గండిపేట మండలం మణికొండలోని కోకాపేట్ గ్రామంలో సర్వే నంబర్ 291, 292లోని 5.25 ఎకరాల కందిశికుల్ భూమిని స్థానిక దళితులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు. మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ తమ భూమిని తీసుకుని నిర్మాణాలు కొనసాగిస్తోందని 100 మందికి పైగా దళితులు నిరసన తెలిపారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.