»Kerala A Woman Who Tried To Deliver With Acupuncture Treatment In The End Both Mother And Child Died
Kerala: ఆక్యుపంక్చర్ వైద్యంతో డెలివరీకి ప్రయత్నించిన మహిళ.. చివరికి తల్లీబిడ్డ ఇద్దరు మృతి
ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ మహిళ తన ప్రాణాలతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఈ విషాదకర ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది.
Kerala: ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ మహిళ తన ప్రాణాలతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఈ విషాదకర ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. గర్భిణి షెమీరా బీవీ ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. పురిటి నొప్పులతో తీవ్ర రక్తస్రావం కావడంతో చివరకు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో తల్లీబిడ్డా మరణించారు. బాధితురాలు షెమీరా బీవీకి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మళ్లీ ఆమె నాలుగోసారి గర్బం దాల్చారు. అయితే, తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారి కూడా ఆమె వైద్యుడిని సంప్రదించలేదు. భర్తతో కలిసి ఆక్యుపంక్చర్ నిపుణుడి వద్ద సూచనలు తీసుకుంది.
డాక్టర్ను సంప్రదించేందుకు ఆమె భర్త నయాజ్ ఒప్పుకోలేదని, ఆశావర్కర్లను కూడా ఇంట్లోకి రానివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. సాధారణ కాన్పు కోసమే నయాజ్ యూట్యూబ్లో వీడియోలు చూసేవాడని.. ఆమెను పక్కింటి వాళ్లతో కూడా మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదని చుట్టుప్రక్కల వాళ్లు చెబుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉండమని నిర్బంధించేవాడని అంటున్నారు. నయాజ్కు షెమీరా బీవీ రెండో భార్య. నెలల నిండిన తర్వాత ఆక్యుపంక్చర్ ద్వారా మొదటి భార్య, ఆమె కుమార్తె సాయంతో ఇంట్లోనే ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి భర్త నయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.