Gold and Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు
పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి.
Gold and Silver Rates : దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు గురువారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(Gold Rate) రూ.318 పెరిగి రూ.64,405కు చేరుకుంది. బుధవారం ఈ ధర రూ.64,087గా ఉంది. అలాగే బుధవారం రూ.73,074గా ఉన్న కిలో వెండి ధర(Silver Rate) రూ.744 తగ్గి రూ..72,330కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం, ప్రొద్దుటూరుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 64,405గా కొనసాగుతోంది. అలాగే ఈ నాలుగు పట్టణాల్లోనూ కిలో వెండి ధర రూ.72,330గా ఉంది. ఈ ధరలన్నీ మార్కెట్ల ప్రారంభం అయ్యే సమయానికి ఉన్నవని గుర్తుంచుకోవాలి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ ధరలు అన్నింటికీ మజూరీలు, ట్యాక్సులు తోడవుతాయని గుర్తుంచుకోవాలి.
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర బుధవారం 2030 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 4 డాలర్లు తగ్గి 2026 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.92 డాలర్లుగా ఉంది. అలాగే ఈ రోజు యూఎస్డీ కాయిన్, టెథర్, బైనాన్స్ కాయిన్ మినహా మిగిలిన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది.