E.G: జిల్లాలో వేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై వారం రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 298 ఓవర్ స్పీడ్ కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ నరసింహ కిషోర్ గురువారం సాయంత్రం తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్టు 11 నుంచి 17వ తారీకు వరకు నిర్వహించడం జరిగిందని, ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 3.10 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ నర్సింహం తెలిపారు.