GNTR: తాడేపల్లిలో బన్నీ గ్యాంగ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న ఈ గ్యాంగ్ సభ్యులు సీతానగరంకు చెందిన దేవర మహేష్‌పై బీరు సీసాలతో దాడి చేశారు. గత 10రోజుల క్రితం కూడా ఈ గ్యాంగ్ కేఎల్ రావు కాలనీకి చెందిన యువకుడిపై దాడి చేసిందన్నారు. ఈ క్రమంలో బాధితుడు మహేష్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.