MDK: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో 8 మండలాలు 1553 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పాపన్నపేట, కౌడిపల్లి, పెద్ద శంకరంపేట, శివంపేట, చిలపిచేడ్ మండలాల్లో పత్తి మొక్కజొన్న పెసర మినుము పంటలు నీటి మునిగినట్లు అధికారులు తెలిపారు.