ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై నిన్న ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు భద్రతను కట్టుదిట్టం చేశారు. రేఖా గుప్తా నివాసాన్ని CRPF బలగాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై వీరి ఆధ్వర్యంలోనే సీఎం భద్రత కొనసాగనుంది. అయితే ఢిల్లీ నుంచి వీధికుక్కులను తరలించడం ఇష్టం లేకనే సీఎంపై దుండగుడు దాడికి పాల్పడినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.