ELR: ఉంగుటూరు మండలం కైకరం శివారులో జాతీయ రహదారి 216ఏ పక్కన మురుగు బోదెలో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ద్విచక్ర వాహనంతో సహా మురుగు బోదుల విగత జీవిగా పడి ఉన్న వ్యక్తిని ఏదైనా వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మృతుడు ఏలూరుకి చెందిన మహమ్మద్ ఖమారుద్దీన్ (52)గా గుర్తింపు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.