Vladimir Putin related To Barbie-Lookalike Ekaterina Mizulina
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తన కంటే 32 ఏళ్లు చిన్నదైన “బార్బీ బొమ్మ లుక్(Barbie-Lookalike)లో ఉండే యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 39 ఏళ్ల ఎకటెరినా మిజులినా(Ekaterina Mizulina)తో పుతిన్ చాలా కాలంగా సంబంధంలో ఉన్నట్లు రాసుకొచ్చారు. పుతిన్‌కు ఎంతో కాలంగా అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ సెనెటర్ సెనేటర్ ఎలెనా మిజులినా(69) కూతురే ఎకటెరినా మిజులినా. మిజులినా క్రెమ్లిన్ అనుకూలంగా ఉండే సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ రష్యా అధ్యక్షుడిపై, ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధంపై విమర్శలను తొలగించడంపై పని చేస్తుంది.
కాట్యా మిజులినా(Ekaterina Mizulina), పుతిన్ అభిరుచికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ బార్బీ బొమ్మ ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉంటుంది అని రష్యన్ మానవ హక్కుల ప్రచారకర్త ఓల్గా రొమానోవా ఉక్రెయిన్ ఛానెల్ 24లో చెప్పారు. పుతిన్ 2014లో 30 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ.. తన భార్య లియుడ్మిలాకు విడాకులు ఇచ్చారు. తరువాత ఒలింపిక్ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు వచ్చాయి. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యాలోని అనేక ఉక్రేనియన్ మీడియా సంస్థలు, టెలిగ్రామ్ ఛానెల్‌లు Mr పుతిన్, Ms మిజులినా గురించి వార్తలను పోస్ట్ చేస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.