ఇటీవల కాలంలో దొంగలు (Thieves) బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది. అంతేకాదు నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎంతో అలవోకగా చోరీలకు పాల్పడటం ఎలా అని బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇక కొంతమంది పోలీసులకు ఎలాంటి ఆచూకీ దొరక్కుండా చోరీలు చేయడం ఎలా అని యూట్యూబ్ (Youtube) వేదికగా చూసి మరి చోరీలు చేస్తూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.ఏటీఎం (ATM) లో దొంగలు పడ్డారని మిషన్ ఎత్తుకు పోయారనే న్యూస్ వింటుంటాం. కానీ పంజాబ్ లో మాత్రం వింత దొంగలు చేసిన పనికి ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీటీవీ(CCTV)లో రికార్డు అయ్యింది.
ఏటీఎం సెంటర్ లో చోరికి వచ్చిన దొంగలు డబ్బులున్న మిషన్ జోలికిపోలేదు. కానీ సెంటర్లోని ఏసీని ఎత్తుకుపోయారు.పంజాబ్ (Punjab) లోని మోగా జిల్లాలోని బాఘ్ పట్టణం ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఈ సెంటర్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు.ఏటీఎం సెంటర్ లోకి వెళ్లారు. ఒకరు డస్టబిన్ను తిరగేశాడు. మరొకరు దానిపైకి ఎక్కి ఏసీకి ఉండే వైర్లు కట్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఏసీని కిందకు దించి తీసుకెళ్లిపోయారు. ఈ చోరీపై బ్యాంకు మేనేజర్ (Bank manager) పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీ దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.