»Priaynaka Attempt At Cooking Dosa During Karnataka Campaign
Priaynaka Gandhi :హోటల్లో దోసెలు పోసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priaynaka Gandhi) రెండు రోజ్రులపాటు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మైసూరు(mysore)లోని ప్రముఖ రెస్టారెంట్(restarant)లో దోసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు.
Priaynaka Gandhi : కర్ణాటక(karnataka)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం( Election campaign)లో అన్ని పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priaynaka Gandhi) రెండు రోజ్రులపాటు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మైసూరు(mysore)లోని ప్రముఖ రెస్టారెంట్(restarant)లో దోసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అంతకుముందు ఆమె కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్(DK Shivakumar), పార్టీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా లాంటి కొంత మందితో కలిసి అల్పాహారం చేశారు.
చాలా ఏళ్లుగా మైసూరులోని మైలారీ హోటల్(Myalri Hotel) చాలా ఫేమస్. ఈ హోటల్లో ఇడ్లీ, దోసెలు(dosa) ఎప్పుడూ ప్రజల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మైలారీ హోటల్ లోకి వెళ్లిన నేరుగా వంట గదిలోకి వెళ్లి ఆమె స్వయంగా దోసెలు పోశారు. తరువాత అదే హోటల్ లో కుర్చున్న ప్రియాంక గాంధీ, డీకే. శివకుమార్, రణదీప్ సూర్జేవాల కడుపునిండా దోసెలు, ఇడ్లీలు ఆరగించారు. మైలారీ హోటల్ యాజమానులు, అక్కడ పని చేసే సిబ్బంది. అదే సమయంలో టిఫిన్ చెయ్యడానికి వెళ్లిన స్థానికులు ప్రియాంక గాంధీతో ఫోటోలు తీసుకుని ఫుల్ ఖుషీ అయిపోయారు.
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
Thank you for your gracious hospitality. The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023