Viral Video: చాలా మంది అన్నంలో నంచుకోవడానికి పాపడ్ ఇష్టపడుతుంటారు. అయితే ఈ వీడియో చూస్తే పాపడ్ తినాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అపరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో పాపడ్ తయారుచేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాపడ్ తయారీలో శుభ్రతప్రమాణాలు ఏ మాత్రం లేవని అర్థం అవుతుంది. అంతే కాదు తయారిదారులు కాళ్లతో తొక్కుతూ పాపడ్ కట్ చేయడం చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ వీడియోను దబాకే ఖావో అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పిండికలపడం, తయారీ విధానం, ఎండబెట్టడం, ప్యాకింగ్ చేయడం వరకు ఈ వీడియోలో చూపించారు.
వీడియోలో చూసినట్లయితే ఓ మహిళ పాపడ్ను గుండ్రంగా కట్ చేసేందుకు ఒక పాత్రను వాడుతుంది. అన్ని ఒకే సారి కట్ చేయాల్సి వచ్చినప్పుడు తాను కాల్లతో తొక్కుతుంది. తరువాత వాటిని విడదీసి ఎండలో ఆరబెడుతున్నారు. ఎండలో ఆరబెట్టే పరదాలు కూడా పరిశుభ్రంగా లేవని తెలుస్తుంది. తరువాత దాన్ని ప్యాక్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు అని అంటున్నారు. కొందరు మాత్రం ఫ్రోజెన్ చికెన్, మాంసం కన్న ఇది చాలా బెటర్, ఆవిడ పాపడ్ను తొక్కడం లేదు కదా అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో నార్త్ సైడ్ అని తెలుస్తుంది.