సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడితేనే ఆస్కార్ అవార్డు వరిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఓ అమెరికన్ నటి డోర్ స్టాపర్‌గా వాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ నటిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి అనేది ఇప్పుడు చుద్దాం.
Gwyneth Paltrow: అమెరికన్ నటి గ్వినేత్ పాల్ట్రో(Gwyneth Paltrow) చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 1998లో వచ్చిన షేక్స్పియర్ ఇన్ లవ్‌లో నటించింది. ఇందులో తన పాత్రకు గ్వినేత్ పాల్ట్రో(Gwyneth Paltrow) ఉత్తమ నటి కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. 1991లో కేరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లలోనే ఆస్కార్ గెలుచుకుంది. తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా నటించి ఆడియన్స్‌కు మరింత చేరువైంది. ఇటీవల గ్వినేత్ ఓ మ్యాగజైన్ ‘ది 77 క్వేషన్స్’ ఇంటర్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన ఆస్కార్ ట్రోఫిని గార్డెన్లో డోర్ స్టాపర్‌గా వాడుతున్నానని తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఇంటర్య్వూలో గ్వినేత్ కెమెరామెన్‌కి తన గార్డెన్‌ను చూపిస్తుంది. ఇంట్లో పెరిగిన మొక్కలు, కూరగాయలు చూపిస్తూ ఉండగా.. కెమెరామెన్ డోర్ స్టాపర్‌గా ఉన్న ఆస్కార్‌ను చూసి షాక్ అవుతాడు. ఎంత అందమైన, విలువైన అవార్డు అని కెమెరామెన్ అంటే.. గ్వినేత్(Gwyneth Paltrow) ఇది నా డోర్స్టాప్. చాలా బాగా పనిచేస్తుందని ఆమె సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఇష్టం లేకపోతే నామినేషన్స్‌లో పోటీ చేయడం మానేయాల్సింది. లేకపోతే తీసుకోవడం అయిన మానేయచ్చుగా.. ఆస్కార్‌ను ఎందుకు అవమానించడమెంటని గ్వినేత్పై(Gwyneth Paltrow) నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అవార్డులకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదేమి మొదటిసారు కాదు. గతంలో సల్మాన్ ఖాన్(Salman Khan) కూడా తన అవార్డును అవసరమైతే డోర్ స్టాపర్‌గా కూడా వాడుతానని చెప్పాడు.