Gold smuggling : బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగి
Gold smuggling బంగారాన్ని చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే బహ్రెయిన్ నుంచి ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చిన్ విమానాశ్రయం చేరుకుంది
Gold smuggling బంగారాన్ని చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే బహ్రెయిన్ నుంచి ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చిన్ విమానాశ్రయం చేరుకుంది. ఆ ఫ్లైట్లో కేబిన్లో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే ఎంప్లాయ్ రెండు చేతులకూ దాదాపుగా కేజీన్నర బంగారాన్ని చుట్టుకుని ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకుని వచ్చాడు. పేస్ట్ రూపంలో ఉన్న 1485 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకూ చుట్టుకున్నాడు. దీని విలువ దాదాపుగా రూ.75 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.
ఈ విషయంపై అందిన ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు అతనిని పట్టుకుని తనిఖీ చేశారు. గ్రీన్ ఛానల్ నుంచి వేగంగా వెళ్లిపోతున్న షఫీని పట్టుకుని పరిశీలించగా ఈ వ్యవహారం బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తు నివేదిక రావాల్సి ఉంది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఎంప్లాయ్ని సంస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఇలాంటి విషయాలను తమ కంపెనీ ఎన్నటికీ సహించదని తేల్చి చెప్పింది. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.