Viral Video: బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరికీ ఉరుకులు పరుగులు తప్పనిసరి. ఉదయం లేస్తే చాలు పరిగెడుతుంటారు. బిజీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ కారణంగా పనులకు సకాలంలో హాజరుకావాలనే ఉద్దేశంతో ముందు వెనుక చూసుకోకుండా వాహనాలను డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు. ఏ మాత్రం రోడ్డుపై సందు దొరికినా ట్రాఫిక్‌లో దూరిపోతుంటారు. అలా వెళ్లిన ఓ కారు డ్రైవర్ కు చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా అతను తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
When you think you are smarter than everyone else 👇
బెంగుళూరులో ఓ వ్యక్తి తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేయడంతో అతనికి పోలీసులు గుణపాఠం నేర్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ రోడ్డు బ్లాక్ చేయబడింది. ప్రజలంతా వారి లైన్లో నిలబడి ఉన్నారు. కారు రైడర్ అవతలి వైపు నుండి కారును తీయడం ప్రారంభించాడు. అప్పుడు ముందు నుండి బస్సు వచ్చింది. దీంతో బస్సు ముందు కారు రివర్స్ వెళ్లాల్సి వచ్చింది. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బెంగళూరు పోలీసులు కూడా యాక్టివ్‌గా మారి వీడియోలో కనిపిస్తున్న కారుకు చలాన్ చేశారు. చాలా మంది ఈ కారు డ్రైవర్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Needful necessary action will be taken. We are checking into it.