»110 Year Old Pakistani Got Married 4th Time Video Goes Viral
Viral: ముసలోడే కానీ మామూలోడు కాదు.. 110 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో నివసిస్తున్న పండు ముసలి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి రూ.5000 మెహర్ కూడా ఇచ్చాడు. ఈ 110 ఏళ్ల వృద్ధుడి కుటుంబంలో మొత్తం 84 మంది ఉన్నారు.
Viral: మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన ప్రమాణం మారింది. ప్రస్తుతానికి నాలుగుపదుల వయసు దాటిందంటే బీపీలు, షుగర్స్ వచ్చి పడుతున్నాయి. దీంతో 65ఏళ్లు బతకడమే కష్టంగా ఉంది. పెళ్లి విషయానికి వస్తే.. 30 దాటితే పిల్లని ఇచ్చే వాళ్లే కరువయ్యారు. కాటికి కాళ్లు చాచుకున్న ఓ ముసలోడు 110ఏళ్లలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే తాను పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయికి రూ.5వేలు కట్నంగా కూడా ఇచ్చాడు. పాకిస్థాన్ దేశంలో ఈ ఘటన జరిగింది. 110ఏళ్లు వచ్చిన ఆ వ్యక్తి బతికి ఉండడమే ఆశ్చర్యం.. ఆ వయసులో ఏకంగా నాలుగో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో నివసిస్తున్న వ్యక్తి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. రూ.5000 మెహర్‌కు కుటుంబంలోని వ్యక్తులు ఒప్పుకున్నారు. ఆవృద్ధుడి కుటుంబంలో మొత్తం 84 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 110 ఏళ్ల వృద్ధుడి పేరు అబ్దుల్ హన్నన్. అబ్దుల్ హన్నన్ 55 ఏళ్ల మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఖాజీ మహ్మద్ అర్షద్‌తో వివాహం జరిగింది. ఇది మాత్రమే కాదు, మన్సెహ్రా జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ ఖలీద్ ఖాన్ కూడా వివాహానికి హాజరై, సాక్షిగా మారారు.
కొడుకు సవతి తల్లి కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు
110 ఏళ్ల అబ్దుల్ హన్నా కుటుంబంలో మొత్తం 84 మంది ఉన్నారు. అబ్దుల్ హన్నన్‌కు మొత్తం ముగ్గురు భార్యలలో 12 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 6 మంది కుమార్తెలు, 6 మంది కుమారులు ఉన్నారు. అబ్దుల్ హన్నా సోదరులు , సోదరీమణుల కుమారులు, కుమార్తెల సంఖ్య కూడా చాలా ఎక్కువ. అబ్దుల్ హన్నా పెద్ద కుమారుడి వయస్సు 70 సంవత్సరాలు. అంటే, అబ్దుల్ హన్నాన్ పెద్ద కొడుకు వయస్సు అతని నాల్గవ భార్య కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. రూ.5000 కట్నంతో జరిగిన ఈ నికాహ్‌లో అబ్దుల్ హన్నన్ కుటుంబీకులు కూడా పాల్గొన్నారు.