»Rajinikanths Comments Are Disturbing Ntrs Soul Ntr Soul Disturb Rajinikanth Rk Roja Roja
Rajinikanth వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది:మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
RK Roja:ఎన్టీఆర్ (ntr) శతజయంతి వేడుకల్లో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (rajinikanth) చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును (chandrababu) చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని రజనీ అన్నారు. దీనిపై అధికార వైసీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. రజనీకాంత్ కామెంట్లను మంత్రి రోజా (RK Roja) ఖండించారు. రజనీకి తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని చెప్పారు.
రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్దాలు చెప్పించారని మంత్రి రోజా (RK Roja) అంటున్నారు. చివరి దశలో ఎన్టీఆర్ ఏమన్నారో వీడియోలు ఇస్తాను.. వాటిని చూడాలని రోజా కోరారు. అసెంబ్లీలో ఎలా అవమానించాలో రికార్డులు పంపిస్తానని తెలిపారు. ఎన్టీఆర్‌పై కార్టూన్లు వేసి అవమానించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అభిమానులను బాధపెట్టేలా రజనీకాంత్ మాట్లాడారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. విదేశాల్లో తెలుగువారు కొలువులు పొందడానికి కారణం వైఎస్ఆర్ అని మంత్రి రోజా (RK Roja) స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ (ysr) అని.. చంద్రబాబు (chandrababu) కాదన్నారు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమయ్యిందని చెప్పారు. మరీ విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కు (rajinikanth) తెలుసా? అని అడిగారు. చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడి.. రజనీకాంత్ (rajinikanth) తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ (ntr) గురించి పొగుడుతున్న చంద్రబాబు (chandrababu) గత 27 ఏళ్ల నుంచి భారతరత్న ఎందుకు ఇప్పించలేదని అడిగారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను యుగ పురుషుడు అంటోన్న వారు గతంలో వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. 2024లో టీడీపీ అధికారం చేపట్టడం కల అన్నారు.