రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటంతోపాటు.. ఎదురుగా వచ్చే వాహనాలపై ఓ కన్నేయాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
అమెరికా(America) వర్జీనియా(virginia)లోని రిచ్‌మండ్‌లోని హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పుల(firing) ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు. అప్పటి వరకు కేవలం కామెడీ పాత్రలు మాత్రమే చేసేవాడు. అలాంటి వేణు(venu) సడెన్ గా డైరెక్టర్ గా మారాడు. చిన్న సినిమానే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూవీ చూసిన తర్వాత అందరూ నోరెళ్ల పెట్టారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఇంత బ్రహ్మాండంగా ఒక చిన్న పాయింట్ తో ఇంత బాగా సినిమా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు వేణు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
'టక్కర్' మూవీ(Takkar Movie) నుంచి ఎపిసోడ్ 1 వీడియోను మేకర్స్ రిలీజ్(Video Release) చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.
అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు.
కేసీఆర్ హైదరాబాద్లో భూ దోపిడీకి పాల్పడి లక్ష కోట్ల దోచుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు పార్థసారధి రెడ్డికి భూమి ఇవ్వడంతోపాటు తన అనుచరులకు అనేక మందికి ఇలాగే ఇచ్చారని పేర్కొన్నారు.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.
బిహార్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తమ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై చేసిన పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తనను, తన సన్నిహితులను ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు మరోమారు రౌడీ మూకలను జగన్ ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.