Madurai బస్ డ్రైవర్ ఎమోషనల్.. రిటైర్మెంట్ రోజు ఇలా.. (వీడియో)
కేరళకు చెందిన బస్సు డ్రైవర్ ముత్తుపాండి రిటైర్మెంట్ డే రోజు భావోద్వేగానికి గురయ్యారు. బస్సు స్టీరింగ్, గేర్ బాక్స్, ఇంజిన్, ముందు భాగానికి నమష్కరించి, ముద్దు పెట్టాడు.
Madurai Bus Driver: విధి నిర్వహణలో ఉద్యోగులు ఒకరితో ఒకరు కలిసి చేస్తుంటారు. కొలిగ్స్ సరదాగా ఉంటారు. విధి నిర్వహణలో 25 నుంచి 35 ఏళ్ల సర్వీసు వరకు ఉంటుంది. చివరికీ రిటైర్మెంట్ డే రానే వస్తోంది. ఆ సమయంలో ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. ఇక తర్వాత ఎప్పటిలాగా ఉండదు. ఉదయాన్నే లేచి రెడీ కావడం.. ఆఫీసుకు రావడం, ఉద్యోగులతో కలిసి వర్క్ షేర్ చేసుకోవడం ఉండదు. సరదాగా మాట్లాడే సిచుయేషన్ కూడా అసలే ఉండదు.
బస్సు డ్రైవర్
ఉద్యోగులు అయితే కలువలేమనో.. అప్పుడప్పుడు మాత్రమే కలుస్తామనే బాధ ఉంటుంది. మరీ వాహనాలు నడిపే వారి పరిస్థితి.. అవును బసు డ్రైవర్ (Driver).. 25 నుంచి 30 ఏళ్లు సర్వీస్ చేసి, రేపటి నుంచి కొలువు లేదంటే బాధ ఉంటుంది. మధురైకి (madurai) చెందిన ఓ బస్సు డ్రైవర్ (Driver) బాధపడ్డాడు. దానికి సంబంధించిన వీడియో తీసి.. షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. తిరుపరంకుండ్రం డివిజన్లో ముత్తుపాండి (Muthupandi) అనే డ్రైవర్ పనిచేసేవాడు. అతని సర్వీస్ బుధవారం అయిపోయింది. చివరి ప్రయాణం మహాలక్ష్మీ కాలనీ నుంచి అనుపానది వరకు కొనసాగింది.
భావొద్వేగం
చివరి రైడ్‌కు ముందు ఆయన భావొద్వేగానికి గురయ్యాడు. బస్సును అపురూపంగా చూశాడు. స్టీరింగ్‌కు నమష్కరించడం, ముద్దు పెట్టుకోవడం చేశాడు. ఎక్స్ లేటర్, గేర్ బాక్స్‌కు నమష్కారం చేశాడు. తర్వాత కిందకు దిగి.. బస్సు ఇంజిన్‌కు దండం పెడతాడు. ముద్దు పెట్టుకొని.. కౌగిలించుకుంటాడు. డ్రైవర్‌గా (driver) సమాజంలో తనకంటూ ఓ గౌరవం దక్కిందని ముత్తుపాండి (Muthupandi) తెలిపారు. దాని ద్వారా తనకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.
జీవితం నిలబడింది
డ్రైవర్‌గా పనిచేయడంతో తన జీవితం నిలబడిందని చెప్పారు. ఉద్యోగం వదిలేయడం అంటే బాధ కలిగిస్తోందని అంటున్నారు. రేపటి నుంచి డ్యూటీ లేదని తెలిసి.. ఒకింత మానసిక సంఘర్షణకు గురి అవుతున్నానని చెబుతున్నారు. నిజమే.. బస్సుతో 30 ఏళ్ల అనుబంధం ఏర్పడి.. ఒక్కసారిగా వదిలేయాలంటే ఆ మాత్రం బాధ ఉంటుంది.