NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవములు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. శ్రీ సరస్వతీ దేవిగా శ్రీ యల్లమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు చిన్నారులు అమ్మవారిని దర్శించుకున్నారు.