NLR: సూళ్లూరుపేట పట్టణం పరిధిలో వెలసిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర అమ్మవారిని నెల్లూరు జిల్లా సెషన్స్ జడ్జి సరస్వతి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జడ్జి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బ్రహ్మనాయుడు, తదితరులు పాల్గొన్నారు.