AP: తూ.గో జిల్లా గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి వద్ద ఏర్పాటుచేసిన అస్సాగో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మరోతి శివగణేష్, పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవిలు నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేస్తారని రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. దీక్ష విరమించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ASP వారిని కోరారు. కలెక్టర్ వచ్చి పరిశ్రమపై తగిన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని తేల్చి చెప్పారు.