HYD: ఆసిఫ్ నగర్ పరిధి వివేకానంద నగర్, భోజగుట్ట ప్రజలను BRS ప్రభుత్వం హయాంలో అక్కడి నుంచి తరిమివేయాలని కుట్రలు చేసిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. భోజగుట్ట వాసులకు అండగా తనతో పాటు జయప్రకాశ్ భరత్ నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భోజగుట్ట ప్రాంత వాసుల కల సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.