KNR: హుజూరాబాద్ పట్టణంలోని శ్రీహనుమాన్ ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి నోటిఫికేషనను దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం విడుదల చేసినట్లు ఈవో సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల భక్తులు ధర్మకర్తల మండలి దరఖాస్తు ఫామ్‌ను నింపి 20 రోజుల్లోగా జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.