జనగాం: పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో చండిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్ బాబు, అర్చకులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.