MBNR: మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులకు మౌలిక వసతులను కల్పించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత వైస్ ఛైర్మన్ విజయ్ పాల్గొన్నారు.