ADB: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో వైల్డ్ లైఫ్ విభాగంలో ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన కిషోర్ ఠాకూర్ మంచి ప్రతిభను కనబరిచాడు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ ఠాకూర్ మాట్లాడారు.