BDK: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్లో బుధవారం రజకులకు రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రతిరోజు రజకులు అవమాన పడుతున్నారని చెప్పారు. నిత్యం వెలివేతకు గురవుతున్నారని వెల్లడించారు.