ADB: బోథ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ మండల నాయకులు రైతులతో కలిసి ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోలంకి రుక్మన్ సింగ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.