JN: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఆర్యవైశ్యులు మండల తహసీల్దార్ శ్రీనివాస్‌ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దని వారికి వినతిపత్రం అందించారు. మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అవమానాలు భరించలేక 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి పేరు మార్చొద్దన్నారు.