ADB: నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామంలో పాఠశాల ప్రహరీ గూడ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్తులతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. సందర్భంగా విద్యార్థులను కలిసి అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని గజేందర్ వారితో తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.