AP: డయేరియా బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భూగర్భ జలాల కలుషితం వల్లే అతిసారం వ్యాప్తి చెందిందని స్పష్టం చేశారు. గుర్లలో క్లోరినేషన్ పనులు చేపట్టామని.. గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శించారు. ఐదేళ్లపాటు జలజీవన్ పథకం నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.