జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా విజయ కిషోర్ రహత్కర్ నియామకమయ్యారు. ఆమె పేరును కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అలాగే, మహిళా కమిషన్లో సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. విజయ కిషోర్ రహత్కర్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నట్లు ప్రభుత్వ నోటిఫికేషన్లో పేర్కొంది. ఛైర్పర్సన్గా ఆమె పదవీకాలం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.