TG: విద్యార్థులకు సంఘీభావంగా అశోక్నగర్కి వెళ్లామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. జీవో 29 వెనక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర ఉందని విద్యార్థులు భయపడుతున్నారని తెలిపారు. జీవో 29పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. పరీక్ష రద్దు చేయమని అనడం లేదని.. రీ షెడ్యూల్ చేయమని మాత్రమే అభ్యర్థులు కోరుతున్నారన్నారు.